రైతు సేవా కేంద్రంపై పిడుగు (VIDEO)

3చూసినవారు
AP: తూర్పుగోదావరి జిల్లా, సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో స్థానిక రైతు సేవా కేంద్రంపై పిడుగు పడటంతో లోపల ఉన్న సామాగ్రి పూర్తిగా ధ్వంసమైంది. భారీ శబ్దానికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పిడుగుపాటుతో కార్యాలయంలో మంటలు చెలరేగగా, స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి సకాలంలో అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్