ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


కేజ్రీవాల్‌కు కేంద్రం అధికారిక బంగ్లా కేటాయింపు
Oct 07, 2025, 05:10 IST/

కేజ్రీవాల్‌కు కేంద్రం అధికారిక బంగ్లా కేటాయింపు

Oct 07, 2025, 05:10 IST
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్రం అధికారిక బంగ్లాను కేటాయించింది. సీఎం పదవి నుంచి వైదొలిగిన దాదాపు ఏడాది తర్వాత, 95, లోధి ఎస్టేట్‌లోని టైప్‌ 7 బంగ్లాను ఆయనకు కేటాయించారు. గతంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి నివసించిన బంగ్లాను కేటాయించాలని ఆప్ కోరినప్పటికీ, అది కేంద్ర మంత్రికి కేటాయించడంతో వేరే బంగ్లాను కేజ్రీవాల్‌కు ఇచ్చారు. అధికారిక నివాసం కోసం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, పది రోజుల్లోగా కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపింది.