విద్యుత్‌ షాక్‌కు గురై లైన్‌మెన్‌ మృతి

21చూసినవారు
విద్యుత్‌ షాక్‌కు గురై లైన్‌మెన్‌ మృతి
TG: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై లైన్ మెన్ ఏ.సతీష్ కుమార్ (42) అక్కడికక్కడే మృతి చెందాడు. పల్లె చెరువు సమీపంలో ఒక వినియోగదారుడి ఫిర్యాదు మేరకు సరఫరాలో పనులు చేపడుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా రావడంతో ఈ దుర్ఘటన జరిగింది. సతీష్ 2015లో విద్యుత్ శాఖలో ఉద్యోగంలో చేరాడు. ఆయనకు భార్య అరుణ, కుమారుడు నీరజ్, కూతురు శ్రీనిత్య ఉన్నారు.

సంబంధిత పోస్ట్