సర్కారుకు లిక్కర్ కంపెనీల అల్టిమేటం

36చూసినవారు
సర్కారుకు లిక్కర్ కంపెనీల అల్టిమేటం
తెలంగాణ ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీలు మరోసారి అల్టిమేటం జారీ చేశాయి. పెండింగ్ బకాయిలైన ₹3,366 కోట్లు తక్షణమే చెల్లించకపోతే మద్యం ఉత్పత్తిని నిలిపివేస్తామని హెచ్చరించాయి. ప్రభుత్వ నుంచి రావాల్సిన బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, బిల్లులు చెల్లించకుంటే ఉత్పత్తి ఆపడం తప్ప మరో మార్గం లేదని లిక్కర్, బేవరేజెస్ కంపెనీల సంఘం స్పష్టం చేసింది. .