TG: హనుమాన్ జయంతి సందర్భంగా రేపు(గురువారం) HYDలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు వైన్స్, బార్లు, వాటికి అనుబంధంగా ఉన్న రెస్టారెంట్లు క్లోజ్ చేయాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక రేపు శోభాయాత్రలు జరగనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.