Top 10 viral news 🔥

దక్షిణ కోస్తాకు అతి భారీ వర్షాలు: వాతావరణ శాఖ
ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంలో వచ్చే 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి అనుకూలంగా ఉండటంతో అతి భారీ వర్షాలు పడతాని, మరో నాలుగు రోజులపాటు ఈ వానలు కొనసాగుతాయని తెలిపింది.




