తెలంగాణలో గుర్తింపు పొందిన పాఠశాలల జాబితా విడుదల

3917చూసినవారు
తెలంగాణలో గుర్తింపు పొందిన పాఠశాలల జాబితా విడుదల
2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల జాబితాను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ www.schooledu.telangana.gov.in లో అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర బోర్డుతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి వివిధ బోర్డులకు అనుబంధంగా ఉన్న పాఠశాలల వివరాలు జిల్లా, మండలాల వారీగా అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రులు ఈ జాబితాను పరిశీలించి, అనుమతులు పొందిన పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్