ఒక డ్రైవర్ కారు తలుపు సడన్‌గా తెరవడంతో జమ్మూ కాశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా పూంచ్‌కు చెందిన వ్యక్తి మృతిచెందాడు. కారు రోడ్డుపై సైడ్‌కు ఆపి ఉండగా.. ఆ వ్యక్తి నార్మల్‌గా బైక్‌పై డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో సడన్‌గా కారు డోర్ తెరవడంతో బైక్‌కి తగిలింది. బైకర్ కింద పడి స్పాట్‌లో మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.