AP: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భైరవపాలెం మొగ వద్ద పెను ప్రమాదం తప్పింది. చింత శ్రీనుకు చెందిన బోటులో తొమ్మిది మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. తెల్లవారుజామున ఈదురు గాలులు, అలల ఉధృతి పెరగడంతో బోటు అదుపుతప్పి సముద్రంలో మునిగిపోయింది. మత్స్యకారులు కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న మరో బోటు సిబ్బంది వెంటనే స్పందించి తొమ్మిది మందినీ రక్షించి ఒడ్డుకు చేర్చారు. ప్రాణనష్టం తప్పినప్పటికీ బోటు, వలలు, వేట సామగ్రి సముద్రంలో మునిగిపోవడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.