LIVE VIDEO: భయానక దృశ్యం.. సెకన్లలో కుప్పకూలిన పర్వతం

36చూసినవారు
నేపాల్‌లో భారీ వర్షాల, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా తాజాగా నమ్మశక్యం కాని రీతిలో ఓ పర్వతం కుప్పకూలింది. భారీ శబ్దంతో కొండచరియలు విరిగిపడగా.. కేవలం కొన్ని సెకన్లలోనే పర్వతంలోని భారీ భాగం నేలమట్టమైనట్లు కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో ఇళ్లు కూలిపోవడం, జనం భయంతో కేకలు వేయడం కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలను పట్టుకొని పరిగెత్తే దృశ్యాలు చూపరులను సైతం భయాందోళనకు గురిచేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్