సిక్కింలోని పశ్చిమ సిక్కిం జిల్లా యుక్సోమ్-తాషిడింగ్ నియోజకవర్గం పరిధిలోని రింబి గ్రామంలో తాజాగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భారీగా మట్టి, రాళ్లు, శిథిలాలు దిగువ ప్రాంతాలకు కొట్టుకొచ్చాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. శిథిలాల కింద గ్రామం చిక్కుకుపోవడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.