యూకేకు చెందిన రాయల్ ఎయిర్‌ఫోర్స్ ‘హాక్ 2’ శిక్షణ
విమానం వేల్స్‌లో ప్రమాదానికి గురైంది. యాంగ్లెసీలోని ఆర్‌ఏఎఫ్ వ్యాలీ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే పెన్ కార్నిసియోంగ్ ప్రాంతంలో కుప్పకూలింది.
విమానం భూమిని ఢీకొనే ముందే ఇద్దరు పైలట్లు పారాచూట్లతో బయటకు దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత
విమానం పూర్తిగా దగ్ధమైంది. నివాస ప్రాంతాలకు దూరంగా ఘటన జరగడంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పింది. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.