యూపీలోని మజ్గావా ఫ్లైఓవర్‌పై తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వారణాసి వైపు నుండి వేగంగా వస్తున్న బొలెరో అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి ముందున్న టాటా మ్యాజిక్‌ను ఢీకొట్టింది. దీంతో బొలెరో 5–6 సార్లు పల్టీలు కొట్టింది. టాటా మ్యాజిక్‌లో ఉన్న వస్తువులు రోడ్డు మీదుగా చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో డ్రైవర్లు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని రెండు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు.