ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఒక ధూళితో కూడిన భారీ ట్రక్కు ఒక్కసారిగా పక్కకు ఒరిగి బోల్తా పడింది. ఈ ఘటనలో సమీపంలోని కొన్ని దుకాణాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. అయితే, ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది. ఈ భీభత్సానికి సంబంధించిన సిసిటివి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.