కర్ణాటకలోని హబ్బల్లిలో తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక చిన్నారిపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా చిన్నారిని కింద పడేసి దాడి చేశాయి. అనంతరం బాలిక గట్టిగా అరిచి గద్దించగానే పారిపోయాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్లు షాక్ అవుతున్నారు.