
ఉత్తరప్రదేశ్లో 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఉత్తరప్రదేశ్లోని 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. అక్టోబర్ 16న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 19లోపు పూర్తవుతుంది. ప్రస్తుత బలాబలాల ఆధారంగా బీజేపీ నేతృత్వంలోని కూటమి 8 రాజ్యసభ స్థానాలను, సమాజ్వాదీ పార్టీ రెండు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని 'హిందుస్థాన్ టైమ్స్' పేర్కొంది.




