ఒంటరి తల్లిగా జీవించడం చాలా కష్టం: సానియా మీర్జా

120చూసినవారు
ఒంటరి తల్లిగా జీవించడం చాలా కష్టం: సానియా మీర్జా
భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన విడాకుల తర్వాతి జీవితంపై దర్శకురాలు ఫరా ఖాన్‌ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో మనసు విప్పి మాట్లాడారు. ఒంటరి తల్లిగా జీవించడం సులభం కాదని, ప్రతి రోజు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. కుమారుడు ఇజ్హాన్‌కి తల్లి, తండ్రి బాధ్యతలను తానే భరిస్తున్నానని చెప్పారు. గతంలో పానిక్‌ అటాక్‌ సమయంలో ఫరా అండగా నిలిచిందని గుర్తుచేశారు. విడాకుల ప్రభావం పిల్లలపై తప్పక ఉంటుందని, అయినా ధైర్యంగా ముందుకు సాగుతానని సానియా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్