
కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌ను కోసిన మహిళ
ఏపీలోని అనంతపురంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన కూతురితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌ను ఓ మహిళ కట్ చేసింది. సురేశ్ అనే ఆటో డ్రైవర్ ఓ వివాహితతో సహజీవనం చేస్తూ, కొన్నాళ్లుగా ఆమె కూతురిపైనా కన్నేశాడు. దీనిని గమనించిన సదరు మహిళ అతడిని ఇంటికి పిలిపించి, చీరతో కట్టేసి ఈ ఘోరానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన సురేశ్‌ను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.




