బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం

28చూసినవారు
బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం
TG: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లోని ఓ స్వీట్ హౌస్‌లో కొనుగోలు చేసిన తినుబండారంలో బల్లి కళేబరం కనిపించడంతో కలకలం రేగింది. మంగళవారం అరుణ్ అనే వినియోగదారుడు బూందీ మిక్చర్, రింగ్స్ కొనుగోలు చేయగా అందులో బల్లి కళేబరం బయటపడింది. దీంతో వారిని ప్రశ్నించగా స్వీట్ హౌస్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా, దురుసుగా ప్రవర్తించారని బాధితుడు ఆరోపించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష దృష్టికి వెళ్లడంతో, తయారీ కేంద్రం, తినుబండారాలను పరిశీలించిన పోలీసులు యజమానిపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్