TG: హన్మకొండ భీమారంలోని ఎస్వీఎస్ కాలేజీ సమీపంలో ఉన్న బాయ్స్ హాస్టల్‌లో భోజనంలో బల్లి పడటంతో విద్యార్థులు షాక్ అయ్యారు. ఈ ఘటనపై హాస్టల్ నిర్వాహకులపై అధికారులకు ఫిర్యాదు చేశారు. తనిఖీలు చేపట్టిన ఫుడ్ సెఫ్టీ అధికారులు అపరిశుభ్ర వాతావరణంలో వంట చేస్తున్నట్లు గుర్తించి, హాస్టల్ నిర్వాహకులకు రూ.15 వేల జరిమానా విధించారు.