TG: ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో విడత సీట్ల కేటాయింపును టీజీసెట్స్ అడ్మిషన్స్-2025 కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగార రెడ్డి విడుదల చేశారు. రెండో విడతలో 1823 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా, 277 మందికి సీట్లు కేటాయించారు. కన్వీనర్ కోటా కింద మొత్తం 282 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 7 లోగా తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలని సూచించారు. ఎల్ఎల్ఎం తరగతులు అక్టోబర్ 23 నుండి ప్రారంభమయ్యాయి.