TG: ఫ్యూచర్ సిటీ, మెట్రోరైల్ విస్తరణ, RRR, రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలని CM రేవంత్ హడ్కో ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. అత్యధిక వడ్డీతో ఇచ్చిన లోన్లను రీకన్స్ట్రక్షన్ చేయాలన్నారు. మరో 10L ఇళ్ల నిర్మాణానికి రుణాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై హడ్కో ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్లు, బుల్లెట్ ట్రైన్ అంశాలపైనా వారు చర్చించారు.