TG: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు వీలైనంత త్వరలోనే హైకోర్టును గడువు కోరనున్నట్లు సమాచారం. ఈ నెల 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఓటరు స్లిప్పులు కూడా తయారు చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర సర్కార్ ఎన్నికలకు మరికొంత వ్యవధి కోరేందుకు సిద్ధమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.