స్థానిక ఎన్నికలు: ఆడపిల్ల పుడితే రూ.2 వేలు, పండుగకు రూ.20 వేలు

65చూసినవారు
మెదక్ జిల్లా హవేలీ ఘన్ పూర్ మండలం కాప్రాయిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుక్కల మౌనిక రూ.100 బాండ్ పేపర్ పై 15 హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. తనను గెలిపిస్తే ఆడపిల్ల పుడితే రూ.2 వేలు, తీజ్ పండుగకు రూ.20 వేలు, ముదిరాజ్ బోనాలకు రూ.8 వేలు, ఎల్లమ్మ బోనాలకు రూ.3 వేలు, అకాల మరణం చెందిన వారికి అంత్యక్రియల కోసం రూ.5 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. హామీలు నెరవేర్చకపోతే తనను తొలగించవచ్చని కూడా ఆమె పేర్కొన్నారు.