గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి పసుల వనమ్మ నరసింహ యాదవ్, తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి రూ.5 లక్షల జీవిత బీమా చేయిస్తానని, ఆడబిడ్డ పుడితే రూ.5వేల ఫిక్స్‌డ్ డిపాజిట్, పెళ్లికి పుస్తెమట్టెలు, అబ్బాయి వివాహానికి రూ.5,116 ఇస్తానని హామీ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆమె 15 హామీలతో కూడిన మేనిఫెస్టోను రూపొందించారు. నెలకోసారి మెడికల్ క్యాంపు, శస్త్రచికిత్సలకు రూ.15వేల సాయం, ఇల్లు కట్టుకునేవారికి రూ.21వేలు అందజేస్తామని చెప్పారు.