ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప‌రామ‌ర్శించిన లోకేశ్

35చూసినవారు
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప‌రామ‌ర్శించిన లోకేశ్
హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేశ్ శనివారం పరామర్శించారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఆరోగ్య పరిస్థితిని లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పవన్‌కు విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం అందజేసి, మెడలో కండువా వేశారు.

సంబంధిత పోస్ట్