సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులను ప్రైవేట్ ట్రావెల్స్ దోచుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు లేవని కృత్రిమ కొరత సృష్టించి, ఆఫీసుల్లో రెట్టింపు ధరలకు టికెట్లు అమ్ముతున్నారని సమాచారం. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా రూ.2 వేలకు పైగా ధర పలుకుతోందని, ట్రావెల్స్ మాఫియా ప్రయాణికులను దోచుకుంటోందని విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ ధరలు పెంచితే తాము పెంచితే తప్పేంటని ప్రైవేట్ ట్రావెల్స్ ఎదురుదాడి చేస్తున్నాయి.