ప్రధాని మోదీతో వీడియో కాల్‌లో ఫ్లైదుబాయ్ పైలట్ స్మిత్ మచ్చర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కష్ట సమయాల్లో హనుమాన్ చాలీసా చదవుతానని, విమానంపై దాడి జరిగినప్పుడు హనుమంతుడే తనకు ధైర్యాన్నిచ్చాడని తెలిపారు. 170 మంది ప్రాణాలను కాపాడటానికి తాను ధైర్యం చూపాల్సి వచ్చిందని భావోద్వేగానికి లోనయ్యారు.
మోదీ నుంచి కాల్ రావడం గర్వంగా ఉందని, ఆయన తనకు అతిపెద్ద స్ఫూర్తి అని పేర్కొన్నారు.