రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ చెక్ పెట్టింది. లార్డ్స్‌లో జరిగిన వన్డే మ్యాచ్ రోహిత్‌కు చివరి మ్యాచ్ కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. రోహిత్ శర్మ భారత జట్టు తరఫున తన సేవలను కొనసాగిస్తారని తెలిపారు. ఆయన రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వెల్లడించారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్‌కు సంబంధించి ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని, అభిమానులు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.