నేటి నుంచి లారీలు బంద్

13చూసినవారు
నేటి నుంచి లారీలు బంద్
తెలంగాణలో లారీల టెస్టింగ్, ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలని సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బంద్ పాటిస్తున్నట్లు తెలిపింది. 13 ఏళ్లు దాటిన వాహనాలకు గతంలో రూ.12 వేలు వసూలు చేయగా, ఇప్పుడు రూ.30 వేలకు పెంచారని అసోసియేషన్ మండిపడింది. మరోవైపు, ఏపీలో లారీ ఓనర్ అసోసియేషన్తో ప్రభుత్వం చర్చలు సఫలం కావడంతో అక్కడ బంద్ తాత్కాలికంగా వాయిదా పడింది.

సంబంధిత పోస్ట్