AP: విశాఖలో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. శ్రీనగర్ జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ రవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు అనకాపల్లి జిల్లా రావికమతం గ్రామానికి చెందిన రవిసాగర్‌గా గుర్తించారు. సిమెంట్ ఫ్యాక్టరీలో రవిసాగర్ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.