బైకును ఢీకొట్టిన లారీ.. గర్భిణి మృతి (వీడియో)

12094చూసినవారు
AP: విజయవాడలోని ఎనికేపాడు వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యాహ్న వేళలో బైకుపై వెళ్తున్న గర్భిణి రోడ్డు దాటుతుండగా.. ప్రమాదవశాత్తు ఓ టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో గర్భిణి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. బైకుపై ప్రయాణిస్తున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలిని ఎర్రంశెట్టి సుష్మగా పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్