బైకును ఢీ కొట్టిన లారీ.. మ‌హిళ మృతి

9చూసినవారు
బైకును ఢీ కొట్టిన లారీ.. మ‌హిళ మృతి
TG: బైకును లారీ ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది. ఆమ‌న‌గ‌ల్ - షాద్ న‌గ‌ర్ ప్ర‌ధాన ర‌హ‌దారి పై బుధ‌వారం ఈ ఘటన జరిగింది. రంగారెడ్డి (D)లోని త‌ల‌కొండ ప‌ల్లి(M) లింగ‌రావుప‌ల్లి గ్రామానికి చెందిన జంగ‌మ్మ‌(50) త‌న అల్లుడు కుమార్ తో క‌లిసి త‌ల‌కొండ‌ప‌ల్లికి బైకుపై వ‌స్తుండ‌గా, వేగంగా వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా, బైక్ నడిపిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :