కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బళ్లారి- బెంగళూరు రహదారిపై మొలకాల్మూరు తాలూకా తుమకుర్లహళ్లి వద్ద కారును లారీ ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను చెల్లకెరెకు చెందిన ప్రమోద్, రాఘవేంద్ర, రుద్రేశ్, సోము, మల్లికార్జునగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.