TG: ఖమ్మం జిల్లాలో ఓ బీభత్సం సృష్టించింది. ఏకంగా పోలీస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కూచిపూడి జగదీష్‌తో పాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో పోలీస్ వాహనం నుజ్జు నుజ్జు అయింది. వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో విధులు నిర్వహించిన అనంతరం పిండిప్రోలు గ్రామం నుంచి PSకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.