TG: జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు స్టేజి దగ్గర జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. హిందూపూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. లారీని వెనుకనుంచి ఢీకొని అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 22 మందిలో 15 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.