కేంద్రం 13 ఏళ్లు దాటిన వాహనాలకు టెస్టింగ్, ఫిట్‌నెస్ ఫీజులను పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని నిలిపివేయాలని ఏపీ లారీ ఓనర్ల సంఘం డిమాండ్ చేసింది. లేదంటే నుంచి రైల్వే షెడ్లు, షిప్ యార్డుల్లో గూడ్స్ రవాణా నిలిపివేస్తామని హెచ్చరించింది. పాత వాహనాలపై అదనపు ఛార్జీల పెంపుతో సరకు రవాణా యజమానులపై పెనుభారం పడుతుందని, ఫీజులు తగ్గించేలా సీఎం వెంటనే నిర్ణయం తీసుకోవాలని లారీ యజమానులు విజ్ఞప్తి చేశారు.