కేంద్రం చౌక దిగుమతులను అడ్డుకునేందుకు యాంటీ డంపింగ్ డ్యూటీ (సుంకాలు) విధించాలన్న సిఫారసులను అమలు చేయకపోవడంతో దేశీ పరిశ్రమకు రూ.11,938 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్టు డీజీటీఆర్ అధ్యయనంలో తేలింది. ఒకవేళ ఈ సుంకాలు విధించినట్టయితే, ఏటా రూ.28,450 కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుందని నివేదిక పేర్కొంది. 33 ఉత్పత్తుల దిగుమతుల రూపంలోనే రూ.1.54 లక్షల కోట్ల నష్టం ఏర్పడగా, 2030 నాటికి ఇది రూ.2.70 లక్షల కోట్లకు పెరగొచ్చని, 24,000
ఉద్యోగాలు నష్టపోయే పరిస్థితి ఉండగా, 2030 నాటికి ఇది 38,000–42,000కు పెరగొచ్చని అంచనా వేసింది.