
ఆ పార్టీకి తిరిగి రావడం కంటే మరణాన్నే ఎంచుకుంటా: తేజ్ ప్రతాప్ యాదవ్
బీహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ఆర్జేడీలోకి తిరిగి రావడం కంటే మరణాన్నే ఎంచుకుంటా. నైతిక విలువలు, ఆత్మగౌరవం నాకు అత్యంత ప్రాధాన్యం. అధికారం అనే ఆకలి లేదు” అని అన్నారు. కాగా, పార్టీ, కుటుంబం నుంచి దూరమైన ఆయన జనశక్తి జనతా దళ్‌ను స్థాపించి మహువా నుంచి పోటీ చేస్తున్నారు.




