ఢిల్లీలో భారీ శబ్దం.. పేలుడు భయంతో ప్రజలు

13122చూసినవారు
ఢిల్లీలో భారీ శబ్దం.. పేలుడు భయంతో ప్రజలు
ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌ ప్రాంతంలో గురువారం ఉదయం రాడిసన్‌ హోటల్‌ సమీపంలో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇది పేలుడు అని భావించి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే, అది పేలుడు కాదని, బస్సు టైర్‌ పేలడం వల్ల ఆ శబ్దం వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు. అగ్నిమాపక శాఖకు సమాచారం అందగా, సిబ్బంది పరిశీలించి టైర్ పేలుడునే కారణమని నిర్ధారించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్