పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సుర్‌జిత్ సింగ్ అనే తండ్రి, తన 17 ఏళ్ల కూతురు ప్రీత్ కౌర్‌కు ఎవరితోనో ప్రేమ వ్యవహారం ఉందనే అనుమానంతో ఆమె చేతులు కట్టేసి కాలువలో పడేశాడు. అంతేకాకుండా, దీనిని వీడియో తీసి స్వయంగా షేర్ చేశాడు. దీంతో బాలిక నీటిలో మునిగి మరణించింది. బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడైన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.