ప్రేమ విఫలం.. పురుగుల మందు తాగిన యువకులు

3చూసినవారు
ప్రేమ విఫలం.. పురుగుల మందు తాగిన యువకులు
TG: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం శాలి లింగోటం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోనేటి అఖిల్, లోడే పవన్ అనే ఇద్దరు యువకులు మద్యం సేవించి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వారిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నల్గొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. లవ్ ఫెయిల్యూర్ కారణమా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో స్థానికులు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్