AP:
ఎన్టీఆర్ జిల్లాలో ఓ కొడుకు తన వృద్ధురాలైన తల్లి పట్ల చూపిన అపారమైన ప్రేమ అందరినీ ఆకట్టుకుంటోంది. తల్లి సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు, బైక్ వెనుక భాగంలో ప్లాస్టిక్ కుర్చీని తాళ్లతో కట్టి, అందులో ఆమెను కూర్చోబెట్టి తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తల్లి పట్ల కొడుకు చూపిన అంకితభావం, అంతులేని ప్రేమను చూసి నెటిజన్లు ఎమోషనల్ అవుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.