AP: కాకినాడ జిల్లాలో లవ్ జిహాద్ కేసులు కలకలం రేపుతున్నాయి. గతంలో సాదిక్ ఖాన్ కేసు మరువకముందే, గౌస్ మోహిద్దీన్ అనే వ్యక్తిపై బాల రమ్యశ్రీ అనే మహిళ ప్రేమ, పెళ్లి పేరుతో మతం మార్చి మోసం చేశాడని కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. జగన్నాధపురానికి చెందిన గౌస్ మోహిద్దీన్ 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత మతం మార్చి చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపించింది. తనతో పాటు మరో ఐదుగురిని కూడా ఇదే విధంగా మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. గౌస్ మోహిద్దీన్ ప్రస్తుతం మరో కేసులో రిమాండ్‌లో ఉన్నట్లు బాధితురాలు తెలిపింది.