ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో పరువు హత్య కలకలం రేపింది. 2024లో ఇంటి నుండి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్న ప్రీతి అనే యువతిని ఆమె సొంత సోదరుడు ఆర్యన్, ఇతర కుటుంబ సభ్యులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై విసిరేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. గురుగ్రామ్‌లో నివసిస్తున్న ప్రీతిని, ఏదో ఒక సాకుతో ఇంటికి పిలిపించి, ఇంటి నుంచి పంపిస్తామని నమ్మించి, కుటుంబ సభ్యులే ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.