TG: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్ళైన నెలరోజుల్లోనే ఓ యువ జంట మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎర్దండి గ్రామానికి చెందిన బోదాసు సంతోష్, గంగోత్రిలు నెల రోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దసరా పండక్కి సంతోష్ గంగోత్రితో కలిసి ఆమె తల్లి గారి ఇంటికి వెళ్లారు. అయితే వాగ్వాదం జరగగా భర్త ఇంటికి తిరిగి వెళ్ళాడు. దాంతో గంగోత్రి ఈ నెల 2న ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా బంధువుల ఇంటికి వెళ్లిన సంతోష్ మంగళవారం చనిపోయినట్లు సమాచారం అందింది. కాగా సంతోష్ మృతికి గల కారణాలు తెలియరాలేదు