తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. రామచంద్రన్ (24) అనే పాల వ్యాపారిని అతని మామ చంద్రన్ (49) కొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఆదివారం సాయంత్రం కూజిపట్టికి వెళ్తున్న రామచంద్రన్‌ను వంతెన సమీపంలో అడ్డగించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రామచంద్రన్, ఆర్తి (21) వివాహానికి యువతి కుటుంబం వ్యతిరేకించడంతో, మూడు నెలల క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.