ఏలూరు జిల్లాలో ముసునూరు మండలం రమణక్కపేటలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై యువతి తల్లిదండ్రులు, బంధువులు దాడి చేశారు. వివాహం చేసుకున్న పల్లం సాయిచంద్, రమణక్కపేట ఉప తపాలా కార్యాలయంలో పోస్టు ఉమెన్‌గా పనిచేస్తున్న సాయి దుర్గ, తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం యువకుడు, యువతి రమణక్కపేట పోస్టాఫీసు వద్ద ఉండగా యువతి తల్లిదండ్రులు వచ్చి యువకుడిని స్తంభానికి కట్టేసి కర్రలతో, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. యువతిని బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు.