ప్రియురాలి మెడపై కత్తితో నరికి ప్రేమోన్మాది ఆత్మహత్య

9చూసినవారు
ప్రియురాలి మెడపై కత్తితో నరికి ప్రేమోన్మాది ఆత్మహత్య
AP: విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో శనివారం నాడు ప్రేమోన్మాది చిన్నా (22) తన ప్రియురాలి మెడపై కత్తితో దాడి చేశాడు. అనంతరం, డాబా పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

సంబంధిత పోస్ట్