రాజస్థాన్‌లోని జైపూర్‌లో 8 నెలల గర్భిణీ అయిన కిరణ్‌ను ఆమె సహజీవన భాగస్వామి ప్రవేశ్ రావత్ గొంతునులిమి హత్య చేశాడు. వేరేవారితో మాట్లాడుతోందనే అనుమానంతో సెప్టెంబర్ 23న ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు.. దుర్వాసన రాకుండా మృతదేహంపై ఉప్పు పోసి ఇంటి ఆవరణలోనే పాతిపెట్టాడు. హత్య చేసిన మరుసటి రోజు నిందితుడు హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు చేశాడు. సెప్టెంబర్ 26న కిరణ్ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి పారిపోయిన నిందితుడిని యూపీ సరిహద్దుల్లో పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకున్నాడు.